మూన్ ఇండస్ట్రిస్ ని ప్రారంభించిన ఎంపీ అర్వింద్
డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లి మండలం నడిపల్లి శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన మూన్ ఇండస్ట్రీస్ ని ఎంపీ అర్వింద్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్ ఇండస్ట్రిస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, అర్బన్, రూరల్ నియోజక వర్గాలకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.