Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2025, 6:02 pm Posted by : ramakrishna

బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఎంపి అరవింద్

 

 నిజామాబాద్, బతుకమ్మ:

 

ఈ నెల 29న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటేక్నిక్ మైదానంలో జరిగే పసుపు రైతుల బహిరంగ సభ స్థలాన్ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పరిశీలించారు. నగరంలో పాలిటెక్నిక్ మైదానంలో సభ ఎర్పాట్లను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మెన్ పల్లె గంగారెడ్డి, పార్టి జిల్లా అధ్యక్షులు కులచారి  దినేష్ లతో కలిసి బుదవారం సాయంత్రం పరిశీలించారు. అదివారం జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం సంధర్బంగా రైతుల సమ్మేళనం ( బహిరంగ సభ) జరుగనుంది. ముఖ్య అతిధిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గోనే సభ ప్రాంగణంతో పాటు భధ్రత ఎర్పాట్లను సమీక్షించారు. వారి వేంట నిజామాబాద్ ఎసిపి రాజా వేంకట్ రెడ్డి, ఇతర అధికారులు, పార్టి నాయకులు ఉన్నారు.

MP Arvind inspects the public meeting venue