- కేసీఆర్, కేటీఆర్, కవితలపై అవాకులు, చెవాకులా?
- తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ను జైల్లో పెడతారా?
- బీజేపీనే రప్పా రప్పా అని తెలంగాణ నుంచి తరిమి కొడతరు
- బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఒక దురంహకారి, కుసంస్కారి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు కాళేశ్వరం అవినీతి, లిక్కర్, ఫొన్ ట్యాపింగ్ వంటివి అంటగడుతూ వీళ్లందర్నీ గప్పా గప్పా గుద్ది రప్పా రప్పా జైళ్లో వెయ్యాలని అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్, కేటీఆర్, కవితలపై అవాకులు చెవాకులా? అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అవినీతి బురదగుంట ఫ్యామిలీలో పుట్టిన అరవింద్ కు నీతి నియమం లేదని ఆయన ధ్వజ మెత్తుతూ కేసీఆర్ ఫ్యామిలీని తిట్టి పెద్ద నాయకుడివై పోవాలనుకుంటున్నావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ను జైల్లో పెడతారా? తెచ్చిన తెలంగాణ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపినందుకు రప్పా, రప్పా అని లోపలేస్తారా? అని ఆయన దుయ్య బట్టారు. కేసీఆర్, కేటీఆర్, కవితల కాలిగోటికి కూడా అరవింద్ సరి పోడన్నారు. బీజేపీనే రప్పా,రప్పా అని తెలంగాణ నుంచి తరిమి కొడతరని ఆయన స్పష్టం చేశారు. అరవింద్ గుజరాత్ గులామ్ లా మాట్లాడుతుండు.ఇప్పటికైనా తెలంగాణ సోయి తెచ్చుకో అని ఆయన హితవు పలికారు. కేసీఆర్ తెలంగాణ సూర్యుడని, ఆయనతో పెట్టుకుంటే అరవింద్ మాడిమసికాక తప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.