నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
బీజేపీ సీనియర్ నాయకులు గుండాల సురేష్ మాతృమూర్తి ఇటీవల మరణించడంతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గురువారం వారి స్వగృహానికి వెళ్లి దివంగత మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గుండాల సురేష్ ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దివంగత మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఎంపీ అరవింద్ ఆకాంక్షించారు. ఎంపీ వెంట రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ మల్కాయి మహేందర్, 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన చిరంజీవి, బీజేపీ నాయకులు బాలకిషన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.