అదనపు నిధుల కోసం మంత్రి కోమటి రెడ్డికి ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ లోని మాదవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం అదనపు నిధులను తక్షణమే మంజూరు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కోరారు. సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ని ఆయన మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆర్వోబి పనుల పురోగతిపై చర్చించారు. ఆర్వోబి పనులకు సంబందించి సవరించిన అంచనాల...