Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 5:55 pm Posted by : ramakrishna

బోధన్‌ లో సినీ ఫక్కీ తరహాలో చోరీ

 

బోధన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సినీ తరహాలో చోరీ ఘటన చోటుచేసుకుంది. గోశాల రోడ్డులోని యూనియన్ బ్యాంక్ ఎదుట పార్కింగ్ చేసిన కారును లక్ష్యంగా చేసుకుని దుండగులు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న నగదును అపహరించారు. బ్యాంక్‌ లో డబ్బులు డ్రా చేసిన జాడి గ్రామానికి చెందిన హరిబాబు కారు బయట నిలిపి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న సుమారు రూ.3 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.