నిర్బంధాలతో ఉద్యమాలను అణచలేరు
నిజామాబాద్, బతుకమ్మ : అంగన్ వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గురువారం చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉన్నందున రాత్రి నుంచే అంగన్ వాడీ ఉద్యోగులను, సీఐటీయూ నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈసందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీల సమస్యలను పరిష్కరించే బదులు పోలీసు నిర్బంధాల ద్వారా ఉద్యమాన్ని అణచాలనుకోవటం అవివేకం అవుతుందన్నారు. బుధవారం రాత్రి నుంచి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ను, తనను పోలీసులు...