కార్పొరేషన్ చైర్మన్ గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్

  నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్‌ చైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం బాడ్సి గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకులు మోతుకూరి చంద్రశేఖర్‌ గౌడ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శేఖర్‌ గౌడ్‌ నియామకం పట్ల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులు, ఇతర పార్టీల నాయకులు, అధికారులు, అనధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులైనట్లు సమాచారం అందుకున్న...