Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 8:00 pm Posted by : ramakrishna

కార్పొరేషన్ చైర్మన్ గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్‌ చైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం బాడ్సి గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకులు మోతుకూరి చంద్రశేఖర్‌ గౌడ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శేఖర్‌ గౌడ్‌ నియామకం పట్ల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులు, ఇతర పార్టీల నాయకులు, అధికారులు, అనధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులైనట్లు సమాచారం అందుకున్న నాయకులు, కార్యకర్తలతో ఆయన నివాసం సందడిగా మారింది. తనను తెలంగాణ రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి, కాంగ్రెస్‌ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి చంద్రశేఖర్‌గౌడ్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.