వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలి : ఎస్సై అశోక్
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై అశోక్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరి వాహనానికి సంబంధించిన ధృవపత్రాలతో పాటు, నంబర్ ప్లేట్లు సరిగా ఉంచుకోవాలని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శంకర్, తదితరులు పాల్గొన్నారు.