Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2024, 9:21 pm Posted by : ramakrishna

వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి

. . . 3వ టౌన్ ఎస్సై ప్రవీణ్ కుమార్                                                                                                                                                          

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేకపోతే వారికి జరిమానాలు తప్పవని 3వ టౌన్ ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం నగరంలోని సుభాష్ నగర్ లో ప్రజలకు హెల్మెట్ పై అవగాహన సదస్సు కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలలో చిన్నపాటి గాయాలతో బయటపడవచ్చని, హెల్మెట్ ధరించకపోతే తలకు దెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చినట్లయితే వారి పై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎక్కువ ప్రమాదాలు హెల్మెట్ ధరించకపోవడం వలన అత్యధికంగా యాక్సిడెంట్లు అయి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో 2వ ఎస్సై నర్సయ్య, ఏఎస్సై లీలా కృష్ణ, ఏఎస్సై వాహెబ్, కానిస్టేబుళ్ళు రఘు, షౌకత్ ఆలీ  పాల్గొన్నారు.