Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 8:24 pm Posted by : ramakrishna

వాహనదారులు సరైన దృవపత్రాలు కలిగి ఉండాలి

  •  97 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు స్వాధీనం
  • అక్రమంగా అమ్ముతున్న 40 మద్యం బాటిళ్లు సీజ్
  •  బోధన్ ఏసీపి శ్రీనివాస్

 

రుద్రూర్, బతుకమ్మ : వాహనదారులు సరైన వాహన దృవపత్రాలు కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని బోధన్ ఏసీపి శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు శనివారం రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రూర్ గ్రామంలో గల జేయన్సీ కాలనీలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్బంగా బోధన్ ఏసీపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాహనదారులు సరైన వాహన దృవపత్రాలు కలిగి ఉండాలని, రోడ్డు పై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ఇతర రాష్ట్రనికి చెందిన వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సరియైన పత్రాలు లేని 4 ఆటోలు, 97 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా  ఒక ఇంట్లో అక్రమంగా మద్యం బాటిల్లు అమ్ముతున్న వాళ్ళ దగ్గర 40 క్వార్టర్ బాటిల్ లను సీజ్ చేయడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో రుద్రూర్ సీఐ కృష్ణ, బోధన్ సీఐ వెంకట నారాయణ, రుద్రూర్ ఎస్సై పి.సాయన్న, బోధన్ సబ్ డివిజన్ ఎస్సైలు, 60 మంది పోలీసు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Motorists must have proper certificates.