Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 February 2025, 7:54 pm Posted by : ramakrishna

విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం

 బతుకమ్మ, ఏర్గట్ల:  పిఎంఎస్ హెచ్ఆర్ఐ పథకం కింద ఏర్గట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. విద్యార్థులు ఎలాంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆత్మవిశ్వాసం ఎలా పెంపొందించుకోవాలి, భవిష్యత్తును ఏ విధంగా నిర్మించుకోవాలి మొదలైన అంశాలను ఇంపాక్ట్ ఫౌండేషన్ సభ్యురాలు వజ్జ నవనీత వివరించారు. ఎవరి చేతుల్లో వారి భవిష్యత్తు ఉంటుందని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలని, చిన్న చిన్న ఉదాహరణల ద్వారా కథల ద్వారా విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి మాట్లాడుతూ, ప్రేరణ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందింప చేయడం, వారికంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగరాణి, పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, పవన్, రాజశేఖర్, రాజ నరసయ్య, రాజేందర్, విజయ్ కుమార్, శ్రీనివాస్, గంగాధర్, ప్రవీణ్ శర్మ, కాల శ్రీనివాస్, గంగమోహన్, ట్వింకిల్, సమత, జ్యోతి, కోమలి తదితరులు పాల్గొన్నారు.