విద్యార్థులను చైతన్యవంతం చేయండి
జిల్లా జాయింట్ కలెక్టర్ అంకిత్ నిజామాబాద్, బతుకమ్మ : జూనియర్ కళాశాల స్థాయిలోనే విద్యార్థిని, విద్యార్థులను చదువుతోపాటు, క్రమశిక్షణ, యాంటీ డ్రగ్స్ పై చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఆయా కళాశాలలలో ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులపైనే ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం సాయంత్రం నిజామాబాద్ కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్...