Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2025, 7:57 pm Posted by : ramakrishna

పింఛన్ డబ్బుల కోసం తల్లి హత్య

వర్ని, బతుకమ్మ : పింఛన్ డబ్బుల కోసం తల్లిని దారుణంగా కొట్టి చంపాడు తనయుడు. ఈ దారుణ ఘటన గురువారం మధ్యాహ్నం వర్ని మండలం జాలాల్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కధనం ప్రకారం.. జలాల్ పూర్ గ్రామానికి చెందిన మక్కలపల్లి సాయవ్వ (57)కు భర్త చనిపోవడంతో వితంతు పింఛన్ వచ్చేది. సాయవ్వ కొడుకు గత కొన్ని రోజులుగా తనకు తాగుడుకు డబ్బులు లేవని పింఛన్ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తు గొడవ పడుతున్నాడు. గురువారం మధ్యాహ్నం సాయవ్వతో సాయిలు గొడవ పడి కుర్చీతో తలపై బాదాడు. కిందపడిన సాయవ్వ తలపైన, చాతిపై రాయిని తీసుకుని చావబాదాడు. ఈ ఘటనలో సాయవ్వ తీవ్రంగా గాయపడటంతో సాయిలు వదిలి పారిపోగా, స్థానికులు ఆమెను బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైధ్యులు సాయివ్వ చనిపోయిందని నిర్థారించారు. ఈ మేరకు వర్ని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.