అల్లుడి చేతిలో అత్త హతం
పిట్లం, బతుకమ్మ : అత్తను అల్లుడు హతమార్చిన ఘటన పిట్లం మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్నలక్ష్మీ మధ్యాహ్న భోజన కార్మికురాలిగా స్థానిక పాఠశాలలో పనిచేస్తుంది. తన కుమార్తెకు అదే గ్రామానికి చెందిన బాగరాజుతో కొంతకాలం క్రితం వివాహం చేసింది. ఇటీవల పంట సాగును అల్లుడు బాగరాజు చూస్తున్నాడు. అయితే పంట డబ్బుల విషయంలో గురువారం ఉదయం గొడవ జరిగింది. స్థానికులు ఇద్దరి మధ్య సయోధ్యతో సద్దుమణిగించారు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్న ...