చిన్నారి హత్య కేసులో తల్లి, మరో వ్యక్తికి జీవితఖైదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని చిన్నారిని దారుణంగా హత్య చేసిన వ్యక్తికి, సహకరించిన చిన్నారి తల్లికి న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామానికి చెందిన సేవేళ్ళ సంజీవ్ కు పని చేసే సమయంలో మోర్తాడ్ వద్ద నిర్మల్ జిల్లా రాంనగర్ కు చెందిన చెంచు రజిత ఆలియాస్ రాధాతో పరిచయం ఏర్పడింది. రజితకు అప్పటికే మూడు సంవత్సరాల అమ్ములు అనే చిన్నారి ఉంది. పరిచయం...