రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

భిక్కనూర్/బాన్సువాడ, బతుకమ్మ : జాతీయ రహదారి 44పై భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. .. బాన్సువాడలోని టీచర్స్‌ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హైదరాబాద్‌కు బయల్దేరారు. చర్చి గేటు వద్దకు చేరుకోగానే లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి లక్ష్మి(50), కుమారుడు అక్షయ్‌(24) మృతి చెందారు. రాజేశ్వర్‌రెడ్డి,...