Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 3:54 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

భిక్కనూర్/బాన్సువాడ, బతుకమ్మ : జాతీయ రహదారి 44పై భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. .. బాన్సువాడలోని టీచర్స్‌ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హైదరాబాద్‌కు బయల్దేరారు. చర్చి గేటు వద్దకు చేరుకోగానే లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి లక్ష్మి(50), కుమారుడు అక్షయ్‌(24) మృతి చెందారు. రాజేశ్వర్‌రెడ్డి, భూమవ్వలకు తీవ్ర గాయాలుకాగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. సమాచారం అందుకున్న భిక్కనూరు ఎస్సై సాయికుమార్ ఘటనాస్థలానికి చేరుకొని విచారణచేపట్టారు. తల్లీకొడుకుల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు