56వసారి రక్తదానం చేసిన మోసర్ల శ్రీకాంత్ రెడ్డి
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మోసార్ల శ్రీకాంత్ రెడ్డి గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో 56వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వలు పడిపోవడంతో ఆయనను సంప్రదించగా రక్తదానం చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేయాలని సూచించారు.