Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 7:17 pm Posted by : ramakrishna

మోర్తాడ్ రైల్వే స్టేషన్ కు మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరు పెట్టాలి

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం బీసీలకు న్యాయం చేయడానికి స్థానిక రైల్వే స్టేషన్ కు మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరున నామకరణం చేయాలనీ బీసీ నాయకులు మామిడాల మనోహర్ పద్మశాలి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ అంశంపై గతంలో పలు సంఘాలు డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్బంగా తెలియజేశారు. శుక్రవారం ఉదయం జిల్లా మోర్తాడ్ మండలం కేంద్రం లోగల ఫూలే విగ్రహం వద్ద అయన 135వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ తమ బీసీలకు 42% రిజర్వేషన్లు కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు కల్సి కృషి చేయాలని కోరారు. అలాగే జి.ఓ-46 వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమస్త బీసీ ఎస్సి ఎస్టీ బహుజన సమాజం సమిష్టిగా ఉద్యమించక తప్పదని వారు హెచ్చారించారు.  కార్యక్రమంలో బండి నారాయణ పద్మశాలి, ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు ఉమేష్ మహారాజ్, మల్లూరి రాజారాం, కాన్షిరాం మాల, బోగిడి భూమేష్, మసూరి శ్రీనివాస్ పద్మశాలి, శశికాంత్ పద్మశాలి, వెల్మాల రాజు, మామిడి రాజు, అంగళి మాల తదితరులు పాల్గొన్నారు.

Mortad railway station should be named after Mahatma Jyotirao Phule