Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2025, 6:11 pm Posted by : ramakrishna

విద్యా, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాల్సింది

  • సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్

 

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ :  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం విద్యా రంగానికి 15% వైద్య రంగానికి 20 శాతం నిధులు కేటాయించి ఉంటే బాగుండేది మధ్యతరగతి, పేదల కుటుంబంలో ఎంత పని చేసినా సుమారు 80 శాతం విద్యా, వైద్యానికే ఖర్చవుతున్నాయని ఎన్నికల్లో గెలుపు కోసం ఇస్తున్న వాగ్దానాలను మరియు ఉచితాలను పక్కనపెట్టి విద్యా, వైద్య రంగానికే పెద్దపీట వేసి ఉంటే మధ్య తరగతి,పేద ప్రజలు సంతోషించే వారు తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి పన్నుల రూపాన రూపాయి వెళితే కేవలం 40 పైసలే తిరిగి కేటాయించడం వల్ల రాష్ట్రం అభివృద్ధి కాదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపాల్సిన వాటా పంపాలని కేంద్రాన్ని కోరారు.