మొరం టిప్పర్ల అడ్డగింత

రెంజల్, బతుకమ్మ: రెంజల్ మండలం నీల గ్రామ శివారులోని ఖజానా కుంట నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్లను బోయ కులస్తులతోపాటు గ్రామస్తులు బుధవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. ఘటనా స్థలంలో టెంట్ వేసుకుని కూర్చుని గురువారం ఉదయం టిప్పర్లను ఇరిగేషన్ ఈఈ,రెవిన్యూ డిపార్ట్మెంట్,పోలీస్ శాఖ అధికారులకు అప్పగించి కేసు చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ యోగేష్, నాయకులు రాఘవేందర్, సుభాష్, రఘు, బోయి కుల సంఘం సభ్యులు, గంగాధర్, అనిల్, భూమన్న, సాయిలు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.