అమ్మ మాట.. అంగన్వాడీ బాట..

రుద్రూర్, బతుకమ్మ:రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ 1,2 సెంటర్లలో ఐసీడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులతో అమ్మ మాట.. బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు. చిన్నారులకు పోషక పదార్థాలతో భోజనం, చక్కని ఆటలు, పాటలు, కథలు, తెలుగు, ఇంగ్లిష్ బోధనా నేర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ శ్రీలత, అంగన్వాడీ టీచర్లు రూప, పద్మ, చిన్నారులు తదితరులు ఉన్నారు.