నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి మోక్షమెప్పుడో..?
--పేరుకే కొత్త మండలాలు.. --స్థలాల పరిశీలనకే పరిమితం చేస్తున్న ప్రభుత్వాలు..! -- సంవత్సరాలుగా అద్దె భవనాలలోనే కార్యకలాపాలు ఇందల్వాయి,బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం గత ప్రభుత్వం కొత్తగా మండలాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఇందల్వాయి మండలం ఉండగా ఇప్పటివరకు సంవత్సరాలుగా అద్దె భవనాలలోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం,పోలీస్ స్టేషన్,ఐకెపి కార్యాలయం,ఫైర్ స్టేషన్,అగ్రికల్చర్ కార్యాలయం ఉన్నప్పటికీ ఇప్పటివరకు సొంత భవన నిర్మాణాలకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వం సర్వేలు చేసి సరిపెట్టుకుందని ప్రజలు విస్మయం వ్యక్తం...