Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2024, 4:02 pm Posted by : ramakrishna

నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి మోక్షమెప్పుడో..?

–పేరుకే కొత్త మండలాలు..
–స్థలాల పరిశీలనకే పరిమితం చేస్తున్న ప్రభుత్వాలు..!
— సంవత్సరాలుగా అద్దె భవనాలలోనే కార్యకలాపాలు

ఇందల్వాయి,బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం గత ప్రభుత్వం  కొత్తగా మండలాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఇందల్వాయి మండలం ఉండగా ఇప్పటివరకు సంవత్సరాలుగా అద్దె భవనాలలోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

Mokshamepet for the construction of new government offices..?

మండల పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం,పోలీస్ స్టేషన్,ఐకెపి కార్యాలయం,ఫైర్ స్టేషన్,అగ్రికల్చర్ కార్యాలయం ఉన్నప్పటికీ ఇప్పటివరకు సొంత భవన నిర్మాణాలకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వం సర్వేలు చేసి సరిపెట్టుకుందని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో సర్వేలు చేసి సరిపెట్టుకుంటారా..ప్రభుత్వ స్థలాలను సర్వే చేసి ప్రభుత్వ నూతన భవన నిర్మాణాలు సకాలంలో చేపడతారో లేదోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే స్థలాల ఎంపిక చేసి నూతన భవన నిర్మాణాల పనులను చేపడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Mokshamepet for the construction of new government offices..?