Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2025, 5:27 pm Posted by : ramakrishna

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి ఎన్నిక

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ర్యాల మోహన్ రెడ్డి ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మొగులయ్య, కార్యదర్శిగా ఖలీల్, హమీద్, అజీమ్​లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.