Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 9:13 pm Posted by : ramakrishna

యూత్ కాంగ్రెస్ ఇన్చార్జిగా మహమ్మద్ అబ్బు

నిజంసాగర్ (మద్నూర్) బతుకమ్మ: ఎల్లారెడ్డి నియోజకవర్గం యూత్ ఇంచార్జ్ ను బుధవారం ఎన్నుకున్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ సుద్ద అమృత, సాయి బాబా కామారెడ్డి జిల్లా ఇన్చార్జిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా విచ్చేసినటువంటి జిల్లా ఇన్చార్జిలకు సన్మానించారు. జిల్లా ఇంచార్జ్ సుద్దు అమృత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను ప్రజలలో తీసుకెళ్లి అవగాహన కల్పించాలని తెలిపారు. మహమ్మద్ అబ్బు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి గా నియమితులు చేసినటువంటి జుక్కల్ నియోజకవర్గం లక్ష్మీ కాంతారావు ఎమ్మెల్యే కు, కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా ఇన్చార్జ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.