Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 5:16 pm Posted by : ramakrishna

పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా మోడీ పాలన

  • పార్టీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్

 

భీమ్ గల్, బతుకమ్మ : దేశంలో పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సే ద్యేయంగా ప్రధాని మోడీ పరిపాలన సాగుతోందని భీమ్ గల్ మండలం బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అరే రవీందర్ అన్నారు. నిన్న పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వం పన్నులు తగ్గించిన నేపథ్యంలో పార్టీ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం శుక్రవారం మండల కేంద్రంలోని బాబాపూర్ గ్రామంలో వివేకానంద విగ్రహం వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా జీయష్టి తగ్గించడం కారణంగా నిత్యావసర వస్తువుల ధర, మందుల ధరతో పాటు ఆరోగ్య భీమా, ఆటోమొబైల్  రంగ వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.మోడీ తీసుకొన్న ఈ నిర్ణయం సంచలన నిర్ణయమని అన్నారు. ఈ నిర్ణయం అటు ప్రజలకు, ఇటు పార్టీకి తొడపాటుననందిస్తుందని ఆయన ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో  మండల ఉపాధ్యక్షులు ఓరగంటి కిషన్, ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్,బీజేవైఎం నాయకులు కొట్టల అశోక్, బీజేవైఎం మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య, మైనార్టీ మోర్చా అధ్యక్షులు హకీం, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు వెంకటేష్, సీనియర్ నాయకులు సంధ్యా రాజ్,తక్కురి అంజయ్య,నాగుల భూమన్న,మచ్చ గంగాధర్, కుండల అన్వేష్,తోట రమేష్,తక్కురి మారుతి,ప్రదీప్ ప్రవీణ్,రవి,అశోక్, గంగాధర్ మరియు భూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.