పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ
వెబ్ న్యూస్, బతుకమ్మ: దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ను (పాంబన్ వంతెన) ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ పద్ధతిలో ఆదివారం ప్రారంభించారు. శ్రీరామనవమి సందర్భంగా దీన్ని ఆయన జాతికి అంకితమిచ్చారు. తమిళనాడులో భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ రామనాథపురం జిల్లాలో రూ. 535 కోట్లతో ఈబ్రిడ్జిని నిర్మించారు. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పోడవున దీన్ని తీర్చిదిద్దారు. వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు, నాలుగేళ్లలో రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈప్రాజెక్టును...