పేదల పట్ల మోడీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని వీడనాడాలి
. . . ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పేదల పట్ల మోడీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని నిరసించాలని సీపీఐ కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు, విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ ఏఐపీకేఎంఎస్, ఏఐయుకేఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్ కోటగల్లిలో సోమవారం సదస్సు నిర్వహించారు. ముందుగా రైతుకూలీ సంఘం నాయకులు అమరుడు శావులం సాయిలు చిత్రపటానికి పూలమాలతో నివాళి...