Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 June 2025, 12:54 pm Posted by : ramakrishna

చినాబ్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన మోడీ

కట్ ఢా, బతుకమ్మ : ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబా ఉక్కు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. కట్ ఢా నుంచి కాశ్మీర్ వరకు వందే భారత రైలును జెండా ఊపి ప్రారంభించారు.  దీంతో శతాబ్దాల కల నేటితో నెరవేరింది.  కశ్మీర్ లోయకు రైలు నడపడం బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. అలాగే కట్ ఢాలో రూ. 46 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టు పనులను మోడీ ఆవిష్కరించారు. కట్ ఢా- శ్రీనగర్ మధ్య రైలుకు  ఆయన జెండా ఊపారు.  దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధించిన అంజీ రైల్వే వంతెన (కేబుల్ బ్రిడ్జి)ను ప్రారంభించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లో మోదీ పర్యటించడం ఇదో తొలిసారి. వంతెన ప్రారంభం అనంతరం మోడీ కట్ ఢా బహిరంగ సభ ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారు.

చినాబ్ వంతెన ప్రత్యేకతలు..

రైలు మార్గం ద్వారా కశ్మీర్ ను భారత్ లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేదుకు చేపట్టిన ఉధంపూర్ –శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఈవంతెన భాగం. చినాబ్ నదీ గర్భం నుంచి 356 మీట్లర్ల ఎత్తులో, 1315 మీటర్ల పోడవుతో దీన్ని నిర్మించారు. అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే వంతెనగా రికార్డు నెలకొల్పింది. అతివేగం, భూకంపాలు, వరదలు, బాంబుపేలుళ్లను సైతం తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతో నిర్మించారు. దీనిపై గరిష్టంగా 100 కి.మీ. వేగంతో రైలు వెళ్లే అవకాశం ఉంది. 1.31 కి,మీ. మేర విస్తరించిన దీని నిర్మాణానికి కేంద్రం సుమారు రూ.1486 కోట్లు ఖర్చు చేసింది. 2002లో వాజ్ పేయీ హయాంలో ఈప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 23 ఏళ్లకు ఈప్రాజెక్టుకు పూర్తయింది.ఈకార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి ఆశ్వని వైష్ణవ్ పాల్గొన్నారు.