ఉపరాష్ట్ర పతి ఎన్నిక కోసం మాక్ ఓటింగ్
డిల్లీ, బతుకమ్మ : ఉపరాష్ట్ర పతి ఎన్నిక మంగళవారం జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో మాక్ ఓటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో ‘మాక్ పోల్’ లో ఇండియా కూటమి పక్షాల ఎంపీలు పాల్గొంటారు. సాయంత్రం ఎన్డీయే కూటమి పక్షాల ఎంపీలు మాక్ పోల్ లో పాల్గొంటారు. రాత్రి 7.30 నిమిషాలలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్...