ఏర్గట్ల పాఠశాల లో మాక్ పార్లమెంట్ కార్యక్రమం
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల ఉన్నత పాఠశాల లో మంగళవారం ఏర్గట్ల స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కొమార గిరి కృష్ణ చారి ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్లమెంట్ లో జరిగే సమావేశాలు ఎలా ఉంటాయో విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శనహితంగా నిర్వహించారు. స్పీకర్ విధులు, ప్రభుత్వ ప్రతినిధుల విధులు, ప్రతిపక్ష సభ్యుల విధులు ఎలా ఉంటాయో, ప్రశ్నోత్తర సమయం జీరో అవర్, ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు, ప్రభుత్వ ప్రతినిధులు చెప్పే సమాధానం ఎలా ఉంటాయో, వీటన్నిటిని విద్యార్థులు మాక్ పార్లమెంట్...