Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 8:37 pm Posted by : ramakrishna

ఏర్గట్ల పాఠశాల లో మాక్ పార్లమెంట్ కార్యక్రమం

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల ఉన్నత పాఠశాల లో మంగళవారం ఏర్గట్ల స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కొమార గిరి కృష్ణ చారి ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్లమెంట్ లో జరిగే సమావేశాలు ఎలా ఉంటాయో విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శనహితంగా నిర్వహించారు. స్పీకర్ విధులు, ప్రభుత్వ ప్రతినిధుల విధులు, ప్రతిపక్ష సభ్యుల విధులు ఎలా ఉంటాయో, ప్రశ్నోత్తర సమయం జీరో అవర్, ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు, ప్రభుత్వ ప్రతినిధులు చెప్పే సమాధానం ఎలా ఉంటాయో, వీటన్నిటిని విద్యార్థులు మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో చాలా చక్కగా ప్రదర్శించారు. స్పీకర్ గా తొమ్మిదో తరగతి చదివే ఏర్గట్ల గ్రామానికి చెందిన విద్యార్థి శ్రీనిధి అద్భుతమైన ప్రదర్శన చేసి అందరిని మెప్పించింది. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మాక్ పార్లమెంట్ కార్యక్రమ నిర్వహణ వల్ల విద్యార్థులకు పార్లమెంట్లో జరిగే విషయాలపై అవగాహన కలుగుతుందని, ఇలాంటి విషయాలు విద్యార్థులు తెలుసుకోవడం వల్ల బయట సమాజం పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, విజయ్, రాజేందర్, శ్రీనివాస్, ప్రవీణ్ శర్మ, గంగాధర్, రాజ నరసయ్య, గంగా మోహన్, ట్వింకిల్, సమత జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.