Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 2:32 pm Posted by : ramakrishna

జీజీహెచ్ లో వరదల్లో వైద్య సేవల పై మాక్ డ్రిల్

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

 నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్  వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల ఏర్పడే అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనే వైద్య సేవలు అందించడం కోసం ఫ్లడ్ మాక్ డ్రిల్  నిర్వహించారు. ఐసీఎస్ ఇన్‌చార్జ్, ఆర్‌డీఓ నిజామాబాద్ కె. రాజేంద్ర కుమార్  ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జీజీహెచ్ లో బ్లడ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిటీ పిలుపు మేరకు, జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సహకారంతో ఈ మాక్ డ్రిల్ చేపట్టారు.. కార్యక్రమంలో ఎస్ డీఆర్ ఎప్, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ శాఖ, ఎన్ సి సి, ఆపద మిత్ర, పోలీస్ , రెవెన్యూ , ఇరిగేషన్ , ఆర్ అండ్ బి , వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,108 అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Mock drill on medical services during floods at GGH

ఆసుపత్రిలో వరదల కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం, రోగుల సురక్షిత తరలింపు, అత్యవసర సేవల సమన్వయ, విభాగాల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్, విపత్తు నిర్వహణ విధానాలపై ప్రాక్టికల్ శిక్షణ ఈ మాక్ డ్రిల్‌లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, సూపరింటెండెంట్ డా. నాగ మోహన్  పర్యవేక్షణలో డా. రాజశేఖర్, డా. సరస్వతి, నర్సింగ్ సూపరింటెండెంట్ లలిత, ఆసుపత్రి సిబ్బంది మరియు 108 బృందం సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా అన్ని శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావడంతో పాటు, వరద అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆసుపత్రి సిబ్బంది తమ సిద్ధతను ప్రదర్శించారు.

Mock drill on medical services during floods at GGH