Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2025, 7:34 pm Posted by : ramakrishna

ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించిన ఎంఎండిఎఫ్

రుద్రూర్, బతుకమ్మ: ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఎంఎండిఎఫ్ అధ్యక్షులు లాల్ మొహమ్మద్  అన్నారు. బుధవారం అక్బర్ నగర్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన దర్గా నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పదోన్నతి పై సంగారెడ్డి వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాల పర్యవేక్షణ అధికారిగా బదిలీపై వెళ్లిన షేక్ గౌసోద్దీన్, బోధినేతర సిబ్బంది ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన షేక్ ఈసాలను అక్బర్ నగర్ ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఎంఎండిఎఫ్ అధ్యక్షులు లాల్ మొహమ్మద్ మాట్లాడుతూ..బాధ్యతమైన ఉద్యోగంలో ఉంటూ ఉద్యోగ ధర్మం పాటిస్తూ అధికారులకు, సహచార ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ అమూల్యమైన సేవలను అందించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సయ్యద్ సికిందర్ ఖాద్రి, కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, మజీద్ సదర్ షేక్ మొహమ్మద్, షేక్ ఫహీం, ఎంఎండిఎఫ్ సభ్యులు జావిద్ హుస్సేన్, షేక్ మహబూబ్, షేక్ బాబు, షేక్ కలీం, షేక్ అన్వర్, ఖలీల్ ఖాన్, మహమ్మద్ అల్తాఫ్, ఫెరోస్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, షేక్ బురాన్, మహమ్మద్ అక్రమ్, షేక్ రసూల్, షేక్ హద్దు, మహమ్మద్ సోఫి, షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.