ఎబీవీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలకు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో  ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. నగరంలోని జనార్థన్ గార్డెన్ లో శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, గ్యాడ్యూయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. శాసన మండలిలో నిరుద్యోగుల తరపున ప్రశ్నించే గొంతుకలు అవుతామని, సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూరు...