నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. నగరంలోని జనార్థన్ గార్డెన్ లో శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, గ్యాడ్యూయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. శాసన మండలిలో నిరుద్యోగుల తరపున ప్రశ్నించే గొంతుకలు అవుతామని, సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ ప్రముఖు రెంజర్ల నరేష్, విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్, విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్, జాతీయ కార్యవర్గ సభ్యులు దామ సునీల్, సమీర్, రంజిత్, దుర్గా దాస్, ప్రేమ్ వాసు, సన్నీ, అభి, విష్ణు, అభినవ్, సాత్విక్, తదితరులు పాల్గొన్నారు.
