మాజీ సీఎం కేసీఆర్ అభిమానికి ఎమ్మెల్సీ కవిత చేయూత

ఇంటర్నెట్ - జిరాక్స్ సెంటర్ ఏర్పాటుకు సహకారం సోమవారం ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కవిత   మహబూబ్ నగర్, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, పార్టీ అధినేత కేసిఆర్ అభిమానులకు ఎప్పుడూ అండగా నిలిచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ కార్యకర్తకు చేయూతను అందించి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజాపురం గ్రామానికి చెందిన చిర్రా సతీష్ కుటుంబం 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ కార్యకర్త, కెసిఆర్ వీరాభిమాని. చిన్ననాటి నుంచి వినికిడి సమస్య ఉన్న సతీష్...