నిజామాబాద్, బతుకమ్మ: పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు నమోదుకు ఈనెల చివరి వరకు అవకాశం కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ కోరారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2021 వరకు డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు మరింత ఓటును నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు. పార్టీ నగర కార్యదర్శి వై ఓమయ్య, సీపీఐ జిల్లా నాయకులు బి.రఘురాం, హనుమాండ్లు తదితరులు పాల్గొన్నారు.