లక్ష్మీ దేవునిపల్లి బస్టాండ్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ ప్రజాకవి గోరేటి వెంకన్న
భిక్కనూర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం లక్ష్మీ దేవుని పల్లి గ్రామంలోని కీర్తిశేషులు కొత్త ఎల్లయ్య జ్ఞాపకార్థం నిర్మించిన బస్టాండ్ ను ఎమ్మెల్సీ ప్రజా కవి గోరేటి వెంకన్న ప్రారంభించారు. అనంతరం రెడ్డి ఫంక్షన్ సభలో ప్రజా కవి గోరేటి వెంకన్న మాట్లాడుతూ లక్ష్మీ దేవునిపల్లి గ్రామానికి చేరుకోవడం పల్లెల ప్రకృతి మంచిదనం మంచి మనసు ఐక్యత కలిగినట్టి లక్ష్మీ దేవునిపల్లి గ్రామ ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. గ్రామాల్లో ఎటు చూసినా హద్దురాళ్ళు వెంచర్ల తోని నిండిపోయిన పల్లె గ్రామాల్లో...