తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ కోదండరాం
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. ఈకమిటీకి చైర్మన్ గా ఎమ్మెల్సీ ఎం.కోదండరాంను నియమించింది. కన్వీనర్ గా సంచాలకులు డా.మామిడి హరికృష్ణ వ్యవహరిస్తారు. సభ్యులుగా సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ గుమ్మడి వెన్నెల, సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు డా. అలేఖ్య పుంజాల, సినీ గీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, కవి దర్శకుడు బి.నర్సింగరావు, కవి జయరాజ్, రచయిత డా.సంగిశెట్టి శ్రీనివాస్, విమర్శకులు డా.కోయి కోటేశ్వరరావు, రచయిత డా.పసునూరి రవీందర్, జానపద కళాకారులు...