Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2025, 11:28 am Posted by : ramakrishna

ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

తీన్మార్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు

కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం

గోదావరి నీళ్లను చంద్రబాబు కు రేవంత్ గిఫ్టుగా ఇస్తున్నాడని ఆరోపణలు

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కలో నుంచి తీసేశా

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తీన్మార్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్న అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.  మీడియా చిట్ చాట్ లో కవిత మాట్లాడారు.  న్యాయ నిపుణులతో చర్చించి బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించనన్నారు. రెండు బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్ చేసింది తానేనని అన్నారు. బీఆర్ ఎస్ నేతలు నా దారికి రావల్సిందేనని కవిత స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారని కవిత ఆరోపించారు. బనకచర్ల ఆపకపోతే తెలంగాణ జాగృతి తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు.  పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో సీఎం అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ లో అని సీఎం చెప్తుంటారని, ముఖ్యమంత్రి ఇంకా కాలేజ్ లోనే  ఉన్నానని  అనుకుంటున్నారన్నారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబు కు గిఫ్టుగా ఇస్తున్నారని వ్యాఖ్యనించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బనకచర్లపై అసలు చర్చ జరగలేదన్నారు.  కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడు వారికి బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కలోనుంచి తీసేశా అని, ఆయన ఎవరో నాకు తెలియదన్నారు.