రెంజల్, బతుకమ్మ: మహాశివరాత్రిని పురస్కరించుకుని రెంజల్ మండలం కళ్యాపూర్ లో నిర్వహించనున్న శివపార్వతుల కల్యాణం, శివరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.50వేల ఆర్థికసాయం అందజేశారు. కవితను గ్రామ బీఆర్ఎస్ యువ నాయకుడు పిల్లల ప్రవీణ్, గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల నిర్వహణ గురించి వివరించగా ఆమె నిజామాబాద్ లోని పార్టీకార్యాలయంలో ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా కళ్యాపూర్ గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు కవితకు కృతజ్ఞతలు తెలిపారు.