Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2025, 1:03 pm Posted by : ramakrishna

టీటీడీ చైర్మన్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ

బతుకమ్మ, వెబ్‌డెస్క్‌

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుతో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి గురువారం హైదరాబాద్‌లో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 30న హరితామ్‌ బావాజీ జయంతి సందర్భంగా బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే హతిరామ్‌ బావాజీ పీఠం నిర్వాహకులు, గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు హామీ ఇచ్చారు. హరిరామ్‌ బావాజీ మఠంలో పూజలు చేయడానికి, హారతి ఇవ్వడానికి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

MLC Kalvakuntla Kavitha meets TTD Chairman