మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం సరికాదు
. . .రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి
. . . ఎథిక్స్ కమిటీ ఫిర్యాదు చేయాలని చైర్మన్ సూచించారు
. . . సీఎం, డీజీపీ కి రిక్వెస్ట్ చేస్తున్న.. ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి
. . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
వెబ్ డెస్క్, బతుకమ్మ :
తెలంగాణ లో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంది. బీసీ బిడ్డలకు ను మహిళలను గౌరవిస్తారు. మీరు బీసీ బిడ్డ కాబట్టి మహిళలపై ఏది పడితే అది మాట్లాడటం సరికాదు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి అన్నారు. తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి కవిత ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ గుత్తా నివాసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల మాట్లాడుతూ…రాజకీయాల్లో మహిళలపై పురుష పదజాలం వాడటం తో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు. తెలంగాణ జాగృతి బీసీ రిజర్వేషన్ల అమలుపై పోరాటం చేస్తూనే ఉన్నాం అని గుర్తు చేశారు.తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మా వాళ్లకు కోపం వచ్చి నిరసన చేశారు.. ఇంత మాత్రానికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా అని ప్రశ్నించారు.ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా తనపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు విషయంలో ఊరుకునే ప్రసక్తే లేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే మీరు వెనకనుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది అని తెలిపారు. ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి… మీరు ఎథిక్స్ కమిటీ కి ఫిర్యాదు చేయాలని చైర్మన్ సూచించారు అని కవిత తెలిపారు.

తీన్మార్ మల్లన్న జాగ్రత్త…
మహిళ ప్రజా ప్రతినిధి అని చూడకుండా పరుష పదజాలంతో వాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్సీ కవితి డిమాండ్ చేశారు. 24 గంటలు గడిచిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఎమ్మెల్సీ మహిళా నేత పై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే.. మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటీ ఈ విషయంలో సీఎం, డీజీపీ కి రిక్వెస్ట్ చేస్తున్న.. ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని కోరారు. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళా జర్నలిస్టుల ను అరెస్టు చేశారు. తీన్మార్ మల్లన్న ఎవరు ? నన్నెందుకు అడ్డుకుంటానని అరుస్తూ గోలా గోలా చేస్తున్నాడు జాగ్రత్త అని ఎమ్మెల్సీ కవిత హెచ్చారించారు.
