వెబ్ డెస్క్, బతుకమ్మ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హైదరాబాద్ లోని సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయని మండిపడ్డారు. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలు మాట్లాడే మాటలు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కొట్టుకునేలా ఉన్నాయని అన్నారు. వీరిపై వ్యవహారాలపై అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణకు హాజరైన సందర్భంగా కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిల వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయన్నారు.