ఏజెన్సీ ప్రాంతాలకు 2 వేల ఇందిరమ్మ ఇళ్లు కోరిన ఎమ్మెల్యేలు

  హైదరాబాద్, బతుకమ్మ :   ఏజెన్సీ ప్రాంతంలోని శాసనసభ నియోజకవర్గాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలోని ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేల బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఆదివాసీ ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని, అలాగే ఇందిర గిరి జల...