Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 April 2025, 9:35 pm Posted by : ramakrishna

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే తోట భోజనం

మద్నూర్ బతుకమ్మ: సన్న బియ్యం లబ్ది దారుడి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సోమవారం డోంగ్లి మండల కేంద్రంలోని సిర్పూర్ గ్రామంలో భోజనం చేశారు. సన్న బియ్యంతో వండిన భోజనం ఎలా ఉందని లబ్ది దారులను అడిగి తెలుసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలు వస్తున్నాయా అంటూ ఆరా తీశారు. ప్రజా ప్రభుత్వం పేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యం ఇచ్చి వారి కడుపు నింపుతుందని ఎమ్మెల్యే అన్నారు. సంపన్నులు తినే సన్న బియ్యాన్ని సామాన్యులకు ఉచితంగా పంపిణీ చేయడంతో ఊరూరా సంబురాలు చేసుకుంటున్నారని చెప్పారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే వాటిని తినడానికి ఎవరూ ఆసక్తి చూపేవారు కాదని తెలిపారు. పథకం పక్క దారి పట్టి దళారులు, మిల్లర్లు లబ్ది పొందేవారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసమే పని చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే తో పాటు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, పరమేష్ పటేల్, సాయి పటేల్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.